మీడియాపై నిర్మాత నాగవంశీ ఫైర్: ఇలానే కంటిన్యూ అయితే, మా దారి మాది.. మీ దారి మీది

మీడియాపై నిర్మాత నాగవంశీ ఫైర్:  ఇలానే కంటిన్యూ అయితే, మా దారి మాది.. మీ దారి మీది

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నేడు (ఏప్రిల్ 1న ) మీడియాపై ఫైర్ అయ్యారు. తాను నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ కలెక్షన్స్పై చేస్తున్న తప్పుడు ప్రమోషన్స్పై  స్పందించాడు. మ్యాడ్‌ స్క్వేర్‌ సాధించిన కలెక్షన్స్ ఫేక్ అని, కావాలనే కౌంట్ ఎక్కువ వేస్తున్నారని కొన్ని వెబ్‌సైట్‌లు చెబుతున్నట్లు నాగ వంశీ ఆరోపించారు. అంతేకాకుండా సినిమా కలెక్షన్స్ ఫేక్ అని నిరూపించాలని సవాలు విసిరారు. 

అవసరం అయితే నా సినిమాలు బాన్ చేయండి, రివ్యూలు రాయకండి, సినిమా చూడకండి అంటూ వంశీ తనదైన శైలిలో మాట్లాడారు. రివ్యూవర్ల రివ్యూస్ ఇస్తేనే సినిమా ఆడుతుందా? తాము సినిమాలు నిర్మించి, ఇంటర్వ్యూలు ఇస్తేనే వెబ్ సైట్స్ నడుస్తున్నాయని చెప్పారు.

Also Read : నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్

నాకు ఎవరి మీద పగ లేదు.. కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే మా దారి మాది మీ దారి మీది అని ఖరాకండిగా చెప్పారు. చివరగా మా జాబ్ సినిమా తీయడం, మీ జాబ్ సినిమా రివ్యూ రాయడం. అది గుర్తించుకుని పనిచేయాలి. లేదంటే, ఇక అంతే సంగతి అని నాగవంశీ చెప్పుకొచ్చారు. నిర్మాత నాగ వంశీ మీడియాపై ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విమర్శలు గుప్పించడం సంచలనం అయింది.

ఇకపోతే ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.69.4కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది.